News October 6, 2025
అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేల భూ కొనుగోళ్లు

అమరావతిపై పూర్తి విశ్వాసంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తాడికొండ, తుళ్లూరు మండలాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నివాస నిర్మాణం పురోగతి సాధించిన నేపథ్యంలో ఈ ఉత్సాహం పెరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రి బంగ్లాలు, అంతర్జాతీయ హోటళ్లు (హాలిడే ఇన్, నోవోటెల్), టెక్ పార్క్ పనులు ఊపందుకున్నాయి. ఈ పెట్టుబడులు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 11, 2026
విజయవాడలో మాజీ ఎంపీ సురేశ్‌పై ఛీటింగ్ కేసు నమోదు

కాకినాడకు చెందిన ఓ ట్రస్ట్ రెన్యూవల్ వ్యవహారంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్ మోసం చేసారంటూ సూర్యారావుపేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ట్రస్ట్ రెన్యూవల్ చేయిస్తానంటూ రూ.25 లక్షలు తీసుకున్న సురేశ్ ఆ పని చేయించలేదంటూ బాధితులు పోలీసులకు విన్నవించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సురేశ్‌పై నేర శిక్షాస్మృతి ప్రకారం కేసు నమోదు చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది.
News March 11, 2026
శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
News March 11, 2026
‘కరోనా’కు ఆరేళ్లు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనాను WHO ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఆరేళ్లు. చైనాలో మొదలైన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. వైద్యులు, శాస్త్రవేత్తల కృషితో వచ్చిన టీకాలు వైరస్ కట్టడికి దోహదపడ్డాయి. రోజులు గడిచిపోతున్నా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ కామెంట్?


