News October 6, 2025
నకిలీ మద్యం ఎక్కడ విక్రయించారు..

మొలకలచెరువులో నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంత కాలంగా నకిలీ తయారు చేసి ఎక్కడ ఎక్కడ విక్రయించారనేది విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసిన ఓ డైరీ పోలీసులకు లభించిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై మారిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు నుంచి సమాచారం.
Similar News
News March 8, 2026
చిత్తూరు: పెరుగుతున్న చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.179 నుంచి రూ.186, మాంసం రూ.260 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.295 నుంచి రూ.320వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 8, 2026
చిత్తూరులో భానుడి ప్రతాపం

సాధారణంగా వేసవి ప్రభావంతో ఏప్రిల్ నాటికి ఎండలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న మూడు రోజులపాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
News March 7, 2026
మృత్యుంజయ స్వామిని దర్శించుకున్న జడ్జి అరుణ

చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక శనివారం చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత స్థానిక శివాలయంలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. శివాలయంలో అర్చకులు, బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.


