News October 6, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు

image

TG: ప్రభుత్వం ప్రతిపాదించిన BC రిజర్వేషన్లకు మద్దతుగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నేత VH, బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, మాజీ IAS చిరంజీవులు వీటిని ఫైల్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలైంది. ఈక్రమంలోనే ఈ కేసులో తమ వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వీటన్నింటినీ న్యాయస్థానం ఎల్లుండి విచారించనుంది.

Similar News

News March 26, 2026

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త

image

AP: ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా వృద్ధులకు ఫ్రీగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇకపై కార్యాలయాలకు తిరిగే అవసరం ఉండదు. ఈ కార్డులతో ఆర్టీసీ బస్సులు, ఆస్పత్రుల్లో రాయితీ లభిస్తుంది. అలాగే దివ్యాంగులకు రుణ రాయితీ స్కీమ్ అమలు చేస్తామని మంత్రి తెలిపారు. వారికి టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు.

News March 26, 2026

‘వందేమాతరం’ తప్పనిసరి కాదు.. కానీ: SC

image

స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ ఆలపించాలంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జాతీయ గేయాన్ని పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొనలేదని తెలిపింది. ఈ విషయంలో పిటిషనర్ మహమ్మద్ సయీద్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించింది. దేశభక్తిపై బలవంతం చేయలేరని పిటిషనర్ తరఫు లాయర్ వాదించగా, జాతీయ గేయం విషయంలోనూ అలా చేయలేరా అని ప్రశ్నించింది.

News March 26, 2026

రేపు సెలవు

image

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం శుక్రవారాన్ని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు బ్యాంకులకు సైతం సెలవు ఉంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో ఈ రోజే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్.