News October 6, 2025
13,217 బ్యాంక్ ఉద్యోగాలు.. BIG ALERT

IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులకు అప్లై చేసుకున్నవారికి అలర్ట్. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇవాళ, రేపు మాత్రమే అవకాశం ఉంది. https://www.ibps.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్, డిసెంబర్‌లో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలుంటాయి.
* మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>‘జాబ్స్’<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 6, 2025
మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. వసుధ, పాడిపంట, భక్తి, జాబ్స్.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <
News October 6, 2025
పావలా వడ్డీకే బ్యాంకుల విద్యారుణాలు: CBN

AP: విదేశాల్లో UG, PG చేయాలనుకునే వారికి పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలిచ్చేలా స్కీమ్ రూపొందించాలని CM CBN ఆదేశించారు. ఎంతమందికైనా అందించగలగాలన్నారు. విదేశాలతో పాటు దేశంలో ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కోర్సులకూ వర్తింపచేయాలని సూచించారు. బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు నెలకొల్పాలని ఆదేశించారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేలా అధ్యయనం చేయాలన్నారు.
News October 6, 2025
2-5 ఏళ్లలోపు అబ్బాయిలు ఎంత ఎత్తు ఉండాలంటే?

పిల్లలు వయసుకు తగ్గట్లు ఎత్తు పెరుగుతున్నారా.. లేదా అని చెక్ చేస్తున్నారా? WHO సిఫార్సు ప్రకారం రెండేళ్ల అబ్బాయి సగటున 87.1 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే 28 నెలలు- 90.4, 30 నెలలు- 91.9, 35 నెలలు- 95.4, 40నెలలు- 98.6, 45నెలలు – 101.6, 50నెలలు- 104.4, 55నెలలు- 107.2, 5వ బర్త్ డే కల్లా పిల్లాడు 110.0cmsల ఎత్తు ఉండాలి. పిల్లాడి ఎత్తుపై సందేహముంటే వైద్యులను సంప్రదించాలి. Share it