News October 6, 2025

ANU ఖాతాలపై ఐటీ శాఖ తాఖీదులు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆదాయపు పన్నుశాఖ నుంచి రూ. 194.91 కోట్ల బకాయిల నోటీసులు రావడంతో కలకలం రేగింది. ఖాతాలు స్తంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన రూ.5 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఈ నిర్ణయం పాలకమండలి అనుమతి లేకుండానే తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర EC నోట్ సంతకాల సేకరణ ప్రక్రియ కూడా అనుమానాస్పదంగా మారింది.

Similar News

News March 18, 2026

కృష్ణా: గ్యాస్ సరఫరాలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ల సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08672-242493కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు.

News March 18, 2026

ఖమ్మం: గ్యాస్ కొరతతో హోటళ్ల సంక్షోభం

image

మధిర పట్టణంలో బుధవారం కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో కొన్ని హోటళ్లు కట్టెలపై వంట చేస్తుండగా, మరికొన్ని పూర్తిగా మూసివేశారు. దాంతో వందలాది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. గ్యాస్ కొరత కొనసాగితే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

News March 18, 2026

ప.గో: కుమారుడితో కలిసి టెన్త్ పరీక్షలు రాస్తున్న తల్లి

image

పాలకొల్లుకు చెందిన ముత్యాల అశ్విని (33) తన కుమారుడు విజయ్‌తో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 2001లో ఆరో తరగతితోనే చదువు ఆపేసి చిన్న వయసులో వివాహం చేసుకున్న ఆమె.. ఇన్నాళ్లకు కుమారుల చొరవతో మళ్లీ పుస్తకం పట్టారు. చదువు విలువ తెలుసుకొని ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్న ఈ తల్లి పట్టుదలను స్థానికులు అభినందిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే వారి ఆశయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.