News October 6, 2025

తుమ్మలలో ట్రాక్టర్ నడిపిన మంత్రి సత్యకుమార్

image

ధర్మవరంలోని తుమ్మలలో నిర్వహించిన వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలసి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యతగా తీసుకుంటోందని తెలిపారు.

Similar News

News October 6, 2025

వరంగల్: 20 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 20 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 19 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒక పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 6, 2025

సినీ ముచ్చట్లు

image

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘OG’ చిత్రం 11 రోజుల్లోనే రూ.308కోట్లు (గ్రాస్) రాబట్టింది
*ఈ నెల 10న జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’, ‘శశివదనే’, ‘కానిస్టేబుల్‌’ చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
* మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 25న విడుదలయ్యే అడివి శేష్ నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ తేదీన రోషన్ మేకా నటించిన ‘ఛాంపియన్’ మూవీ రాబోతోంది.

News October 6, 2025

NGKL: అండర్-19.. 8న కబడ్డీ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 8న బాల, బాలికల U/19 కబడ్డీ ఎంపికలు ఉంటాయని నాగర్ కర్నూల్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. MBNRలోని స్టేడియంలో ఉ. 9:00 గం. ఎంపికలు ఉంటాయని, 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులని, బాలురు 70 కేజీలు, బాలికలు,65 కేజీల బరువు కలిగి ఉండాలని, ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్, ఆధార్ తీసుకొని రావాలన్నారు.