News October 6, 2025
సత్తా చాటిన శ్రియాన్షి

తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి Al Ain Masters వరల్డ్ టూర్ సూపర్ 100 టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటారు. ఈమె పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మాజీ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ తస్నిమ్ మీర్‌పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నారు. దీంతో శ్రియాన్షికి 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Similar News
News October 6, 2025
వీరి రుణం తీర్చుకుంటేనే మానవ జన్మకు సార్థకత

మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి పితృ, దైవ, రుషి రుణాలు తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో కష్టపడి పెంచిన తండ్రికి ధర్మబద్ధంగా ఉంటూ తనయుడు తన రుణం తీర్చాలి. ఈ సృష్టిని పోషిస్తున్న భగవంతుని రుణం ధర్మాచరణతో తీర్చాలి. ఇక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు, రుషుల రుణాన్ని వారి జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా తీర్చుకోవాలి. ఈ మూడు రుణాలను తీర్చుకున్నప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత లభిస్తుంది.
News October 6, 2025
‘ECINet’లో ఎన్నికల పూర్తి సమాచారం: CEC

ఎన్నికల సమాచారం పూర్తిగా ఒకే చోట తెలుసుకునేలా ‘ECINet’ సింగిల్ విండో యాప్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు CEC జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. దీన్ని మథర్ ఆఫ్ ఆల్ యాప్స్‌గా అభివర్ణించారు. బిహార్ ఎలక్షన్స్ నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎలక్షన్స్‌కు సంబంధించిన 40కి పైగా యాప్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. బూత్ లెవల్ ఆఫీసర్స్ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ వరకు అందరినీ ఇది అనుసంధానం చేయనుంది.
News October 6, 2025
ఇది దేశ చరిత్రలో చీకటి రోజు: సీఎం రేవంత్

సుప్రీంకోర్టులో CJI గవాయ్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘ఇది దేశ చరిత్రలో చీకటి రోజు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయలేవని CJI ధైర్యంగా ప్రకటించారు’ అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘CJIపై దాడికి యత్నం సిగ్గుచేటు. ఇది మన న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన దాడి. జుడీషియరీ సేఫ్టీ, సెక్యూరిటీ ఎంతో ముఖ్యం’ అని ఖర్గే అన్నారు.