News October 6, 2025
ప్రైవేట్ స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణమా?: భూమన

కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనే TTD తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ‘జీ-స్క్వేర్ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న ఆ స్థలంపై ఈడీ విచారణ సాగుతోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే టీటీడీ నిధులతో ఆ స్థలంలో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. జీ-స్క్వేర్ సంస్థతో బీఆర్ నాయుడికి ఏమైనా లింకులా ఉన్నాయోమోనని మాకు అనుమానం వస్తోంది’ అని భూమన అన్నారు.
Similar News
News October 6, 2025
రంగారెడ్డి: బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటోంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్తల వరకు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరఫున బీఫామ్ అందజేయనుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావాహుల పేర్లను నమోదు చేసుకుంటోంది.
News October 6, 2025
జగిత్యాల: నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో నామినేషన్‌కు సంబంధించి ఆర్ఓ, ఏఆర్ఓలకు సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పకడ్బందీ నిర్వాహణను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
News October 6, 2025
దౌల్తాబాద్: సీపీ అనురాధ పెద్ద మనసు

దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకు చెందిన జోడు రాకేశ్‌కు కుడిచేయి లేని విషయం తెలుసుకున్న సీపీ డాక్టర్ బి. అనురాధ పెద్ద మనసు చాటుకున్నారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి రాకేశ్‌కు కృత్రిమ చేయి(ఆర్టిఫీషియల్ హ్యాండ్) అమర్చేందుకు అయ్యే ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సీపీని రాకేశ్ కలిసి పుష్పగుచ్ఛం అందించగా, రాకేశ్ తండ్రి మనోహార్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.