News October 6, 2025

HYDలో గుండెపోటుతో ACP విష్ణుమూర్తి మృతి

image

పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్‌‌‌కుహెచ్చరిక జారీ చేసిన ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో మరణించారు. సుదీర్ఘకాలం పాటు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన, HYDలోని తన నివాసంలో హార్ట్‌అటాక్‌కు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News October 6, 2025

రంగారెడ్డి: బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

image

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటోంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్తల వరకు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరఫున బీఫామ్ అందజేయనుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావాహుల పేర్లను నమోదు చేసుకుంటోంది.

News October 6, 2025

జగిత్యాల: నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో నామినేషన్‌కు సంబంధించి ఆర్ఓ, ఏఆర్ఓలకు సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పకడ్బందీ నిర్వాహణను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

News October 6, 2025

దౌల్తాబాద్: సీపీ అనురాధ పెద్ద మనసు

image

దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకు చెందిన జోడు రాకేశ్‌కు కుడిచేయి లేని విషయం తెలుసుకున్న సీపీ డాక్టర్ బి. అనురాధ పెద్ద మనసు చాటుకున్నారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి రాకేశ్‌కు కృత్రిమ చేయి(ఆర్టిఫీషియల్‌ హ్యాండ్‌) అమర్చేందుకు అయ్యే ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సీపీని రాకేశ్ కలిసి పుష్పగుచ్ఛం అందించగా, రాకేశ్ తండ్రి మనోహార్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.