News October 6, 2025

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే

image

❂ అక్టోబర్ 8: మెయింటెనెన్స్ రిక్వైర్డ్(ప్రైమ్ వీడియో)
❂ అక్టోబర్ 9: వార్ 2(నెట్‌ఫ్లిక్స్-సినీ వర్గాల సమాచారం)
❂ అక్టోబర్ 10: మిరాయ్(జియో హాట్‌స్టార్)
❂ త్రిబాణధారి బార్బరిక్(సన్ నెక్స్ట్)
❂ స్థల్(జీ 5)
❂ స్విమ్ టు మీ(నెట్‌ఫ్లిక్స్)

Similar News

News October 6, 2025

సినీ ముచ్చట్లు

image

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘OG’ చిత్రం 11 రోజుల్లోనే రూ.308కోట్లు (గ్రాస్) రాబట్టింది
*ఈ నెల 10న జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’, ‘శశివదనే’, ‘కానిస్టేబుల్‌’ చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
* మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 25న విడుదలయ్యే అడివి శేష్ నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ తేదీన రోషన్ మేకా నటించిన ‘ఛాంపియన్’ మూవీ రాబోతోంది.

News October 6, 2025

బిహార్‌లో విజయం NDAదే: Matrize Opinion Poll

image

బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని Matrize Opinion Poll అంచనా వేసింది. NDA (బీజేపీ, జేడీయూ)కి 150-160 సీట్లు వస్తాయని, మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్‌కు 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది.

News October 6, 2025

వీరి రుణం తీర్చుకుంటేనే మానవ జన్మకు సార్థకత

image

మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి పితృ, దైవ, రుషి రుణాలు తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో కష్టపడి పెంచిన తండ్రికి ధర్మబద్ధంగా ఉంటూ తనయుడు తన రుణం తీర్చాలి. ఈ సృష్టిని పోషిస్తున్న భగవంతుని రుణం ధర్మాచరణతో తీర్చాలి. ఇక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు, రుషుల రుణాన్ని వారి జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా తీర్చుకోవాలి. ఈ మూడు రుణాలను తీర్చుకున్నప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత లభిస్తుంది.