News October 6, 2025

ప్రభుత్వ వైఫల్యంతోనే కరూర్ తొక్కిసలాట : NDA MPలు

image

కరూర్(TN) తొక్కిసలాటలో 41 మరణాలపై NDA MPలు నివేదిక రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమని తేల్చారు. జనాల సంఖ్యపై అంచనాలేమి, క్రౌడ్ మేనేజ్మెంటులో వైఫల్యం ఉందన్నారు. 3వేల మంది పట్టే గ్రౌండ్‌లో 30వేల మంది గుమిగూడారు. 2 గం.కు రావలసిన విజయ్ రాత్రి 7 గం.కు వచ్చారు. ఆయన బస్సుపైకెక్కి అభివాదం చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. నివారించదగ్గదే అయినా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్ల ఇది జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News October 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 27 సమాధానాలు

image

1. రామాయణంలో శేషనాగ అవతారంగా లక్ష్మణుడిని పరిగణిస్తారు.
2. మహా భారతంలో ఉప పాండవులను చంపింది ‘అశ్వత్థామ’.
3. కలియుగం 4,32,000 సంవత్సరాలు.
4. నదీ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.
5. లక్ష్మీదేవి వాహనం ‘గుడ్లగూబ’.
<<-se>>#IthihasaluQuiz<<>>

News October 6, 2025

సినీ ముచ్చట్లు

image

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘OG’ చిత్రం 11 రోజుల్లోనే రూ.308కోట్లు (గ్రాస్) రాబట్టింది
*ఈ నెల 10న జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’, ‘శశివదనే’, ‘కానిస్టేబుల్‌’ చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
* మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 25న విడుదలయ్యే అడివి శేష్ నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ తేదీన రోషన్ మేకా నటించిన ‘ఛాంపియన్’ మూవీ రాబోతోంది.

News October 6, 2025

బిహార్‌లో విజయం NDAదే: Matrize Opinion Poll

image

బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని Matrize Opinion Poll అంచనా వేసింది. NDA (బీజేపీ, జేడీయూ)కి 150-160 సీట్లు వస్తాయని, మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్‌కు 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది.