News October 6, 2025
గజ్వేల్: కామన్ డైట్ మెనూ పాటించాలి: కలెక్టర్

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పప్పు, ఆలు గడ్డ, క్యారెట్ కలిపి కూర, సాంబార్, బాగరా అన్నం పెడుతున్నట్లు వంట సిబ్బంది తెలపగా కూర నాణ్యత మెరుగుపరచి రుచికరంగా వండాలని సిబ్బందిని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఆకుకూరలు ఎక్కువగా వాడాలని సూచించారు.
Similar News
News October 6, 2025
స్థానిక సంస్థల్లో BCలకు 34% కోటాపై CBN ఆదేశాలు

AP: BCలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా భారీగా నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని CM CBN అన్నారు. అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చూడాలని అధికారులకు సంక్షేమ సమీక్షలో సూచించారు. కులవృత్తుల్లో ఆధునీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 6, 2025
విజయవాడ బస్టాండ్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

విజయవాడ బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి గుంటూరు నుంచి మచిలీపట్నానికి వెళ్తున్న క్రమంలో 47వ ఫ్లాట్‌ఫామ్ వద్ద గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. లక్షలాది మంది ప్రయాణికులు వచ్చే బస్టాండ్‌లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా అస్వస్థతకు గురవుతున్న వారిని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు.
News October 6, 2025
NOV 12 లోగా బకాయి CMR పూర్తి చేయాలి: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సోమవారం IDOC మీటింగ్ హాల్‌లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించి బకాయి ఉన్న CMR (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను నవంబర్ 12 లోగా పూర్తి చేయాలని మిల్లర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మిల్లును ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రోజువారీ విజిట్ చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, FCI డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.