News October 6, 2025
మోక్షానికి సులభమైన మార్గం భక్తి ఒక్కటే

భక్తి మార్గానికి ఇతర మార్గాల వలె కఠినమైన నిబంధనలు ఉండవు. జ్ఞాన మార్గానికి వివేకము, వైరాగ్యము వంటి కష్టతరమైన సాధనా చతుష్టయం అవసరం. అర్హత లేనివారు జ్ఞానాన్ని అభ్యసిస్తే, వారికి అహంకారమే మిగులుతుంది. యోగ మార్గానికి యమ, నియమాది అష్టాంగాలు అవసరం. వీటిని పాటించకపోతే బాధలు తప్పవు. కానీ భక్తి యోగంలో ఈ నియమాలుండవు. భగవంతుడిపై భక్తి ఉంటే చాలు! ఈ శ్రేష్ఠ మార్గమే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. <<-se>>#Daivam<<>>
Similar News
News October 6, 2025
2019 తర్వాతా CBN సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేది: నిమ్మల

2027 చివరి నాటికి PM చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2019 తర్వాత సీఎంగా CBN కొనసాగుంటే ఇప్పటికే అది పూర్తయ్యేదన్నారు. YCP హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, రివర్స్ టెండర్లంటూ పనులు జాప్యం చేశారని విమర్శించారు. తాము పనులు వేగవంతం చేశామన్నారు. బిహార్ ఎన్నికలయ్యాక కేంద్ర మంత్రి CRపాటిల్ ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయనతో భేటీ అనంతరం చెప్పారు.
News October 6, 2025
5 ఏళ్లలో బంగారం, వెండి ధరల పెరుగుదల ఇలా

బంగారం, వెండి ధరలు ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లలో బంగారంపై 138శాతం, వెండిపై 156శాతం రాబడి వచ్చిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 2020 అక్టోబర్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.50,690 ఉండగా ఇవాళ రూ.1.2లక్షలకు చేరింది. అలాగే కేజీ వెండి ధర రూ.60,533 నుంచి రూ.1.60లక్షలకు ఎగబాకింది. దీంతోపాటు ప్లాటినంపై 43శాతం, కాపర్‌పై 69శాతం రిటర్న్ వచ్చినట్టు తెలిపారు.
News October 6, 2025
CJIపై దాడికి యత్నించిన లాయర్ సస్పెన్షన్

CJI BR గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ కోర్టు, ట్రిబ్యునల్, లేదా లీగల్ అథారిటీలో ప్రాక్టీస్ చేయకుండా వేటు వేసింది. తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీస్ జారీ చేయనుంది. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత 15రోజుల్లోగా తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో లాయర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాగా CJIపై దాడికి యత్నించడాన్ని CPI ఖండించింది.