News October 6, 2025
PCOSలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే వీటిలో A, B, C, D అని నాలుగు రకాలున్నాయంటున్నారు నిపుణులు. Aలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఉన్నప్పటికీ మగ హార్మోన్లు ఎక్కువగా ఉండవు.
Similar News
News October 6, 2025
స్థానిక సంస్థల్లో BCలకు 34% కోటాపై CBN ఆదేశాలు

AP: BCలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా భారీగా నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని CM CBN అన్నారు. అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చూడాలని అధికారులకు సంక్షేమ సమీక్షలో సూచించారు. కులవృత్తుల్లో ఆధునీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 6, 2025
2019 తర్వాతా CBN సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేది: నిమ్మల

2027 చివరి నాటికి PM చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2019 తర్వాత సీఎంగా CBN కొనసాగుంటే ఇప్పటికే అది పూర్తయ్యేదన్నారు. YCP హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, రివర్స్ టెండర్లంటూ పనులు జాప్యం చేశారని విమర్శించారు. తాము పనులు వేగవంతం చేశామన్నారు. బిహార్ ఎన్నికలయ్యాక కేంద్ర మంత్రి CRపాటిల్ ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయనతో భేటీ అనంతరం చెప్పారు.
News October 6, 2025
5 ఏళ్లలో బంగారం, వెండి ధరల పెరుగుదల ఇలా

బంగారం, వెండి ధరలు ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లలో బంగారంపై 138శాతం, వెండిపై 156శాతం రాబడి వచ్చిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 2020 అక్టోబర్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.50,690 ఉండగా ఇవాళ రూ.1.2లక్షలకు చేరింది. అలాగే కేజీ వెండి ధర రూ.60,533 నుంచి రూ.1.60లక్షలకు ఎగబాకింది. దీంతోపాటు ప్లాటినంపై 43శాతం, కాపర్‌పై 69శాతం రిటర్న్ వచ్చినట్టు తెలిపారు.