News October 6, 2025
భద్రాద్రి జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం 8:30 వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మపేట 79.5 మి.మీ, టేకులపల్లి 76.3, అశ్వరావుపేట 48.8, లక్ష్మీదేవి పల్లి 38.8, చుంచుపల్లి 35.3, పాల్వంచ 30.5, కొత్తగూడెం 23.3, ములకలపల్లి 17.8, అన్నపురెడ్డిపల్లి 16.8, బూర్గంపాడు 4.5, భద్రాచలం 3, గుండాల 1.5, ఆళ్లపల్లి 0.8 మి.మీల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.
Similar News
News March 21, 2026
కరీంనగర్: థియేటర్‌లో సందడి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సందడి చేశారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో విడుదలైన ‘దురంధర్-2’ చిత్రాన్ని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. చిత్ర బృందాన్ని అభినందించిన ఆయన, సినిమా ఆకట్టుకునేలా ఉందన్నారు. కేంద్ర మంత్రి రాకతో థియేటర్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
News March 21, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

➤శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల వర్షం.. పిడుగులు
➤లావేరు: వైన్ షాపులో చోరీ..ఇద్దరు అరెస్ట్
➤టెక్కలి: ఉగాదిన రూ.31 లక్షల మద్యం అమ్మకాలు
➤SKLM: రేపు టెన్త్ పరీక్ష ఏప్రిల్ 2కి వాయిదా
➤పలాస: కార్గో ఎయిర్ రద్దు చేయాలని నిరసన
➤కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అచ్చెన్న
➤ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీలో సస్పెన్షన్ల కలకలం.?
News March 21, 2026
తెనాలి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి

పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి(48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేశారు.


