News October 6, 2025
పీజీఆర్ఎస్‌కు 32 అర్జీలు: ఎస్పీ

అమలాపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)కు 32 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఎస్పీకి అందజేశారు. వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
Similar News
News March 15, 2026
సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.
News March 15, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.
News March 15, 2026
కార్మికులంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. కార్మికులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఆరోగ్య సేవలను స్వయంగా సమీక్షించారు. అనారోగ్య లక్షణాలున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులంతా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


