News October 6, 2025

విజయవాడలో మహిళ హత్యకు కారణం ఇదే..!

image

విజయవాడ భవానిపురంలో సంచలనం సృష్టించిన విజయలక్ష్మి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కక్ష్యతో లక్ష్మీనరసింహా, అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పుట్టింటికి వెళ్లడానికి విజయలక్ష్మి కారణమని కక్ష పెంచుకున్న లక్ష్మీనరసింహ ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు.

Similar News

News March 6, 2026

పార్వతీపురం: జువాలజీ, ఎకనామిక్స్ పరీక్షకు 225 మంది డుమ్మా

image

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ జువాలజీ, ఎకనామిక్స్ పరీక్షకు 224 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. జనరల్ విద్యార్థులు 3409 మందికి 101 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2578 మందికి గానూ 123 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5987 మంది విద్యార్థులకు 224 మంది గైర్హాజరు అయ్యారని అన్నారు.

News March 6, 2026

రామడుగు: రెండు రోజుల్లో పెండ్లి.. ఇంతలోనే దారుణం..!

image

పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. రామడుగుకు చెందిన ఈరెల్లి గౌరమ్మ (65) తన పెద్ద కుమారుడి వివాహ ఏర్పాట్లలో ఉండగా, హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘాతుకం వెనుక తెలిసిన వారే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News March 6, 2026

నెల్లూరు: మళ్లీ కొండెక్కిన ధర.. కేజీ రూ.320

image

జిల్లాలో చికెన్ ధరలు మరోసారి కొండెక్కాయి. వేసవిలో చికెన్ ధరలు తగ్గడం సహజం. అయితే అనూహ్యంగా మార్చిలో ధర పెరగడంతో మాంసం ప్రియులు షాక్‌కి గురవుతున్నారు. జనవరిలో పండుగల సందర్భంగా స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.350 ఉండగా అనంతరం ధరలు తగ్గు ముఖం పట్టాయి. మార్చి ప్రారంభం కాగానే మళ్లీ చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.