News October 6, 2025

ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – అంజనాద్రి

image

తిరుమలలో నాల్గవ కొండే ‘అంజనాద్రి’. ఇక్కడ ధ్యానం చేసే సాధకుని కుండలిని శక్తి హృదయ స్థానంలోని అనాహత చక్రాన్ని చేరుకుంటుంది. ఈ స్థితిలో సాధకునికి స్థూల శరీర స్పృహ తగ్గి, శరీరం చాలా తేలికగా, గాలిలో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. దీని ద్వారా సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి వంటి వాయుగమనాన్ని, చురుకుదనాన్ని పొందుతాడు. అందుకే ఈ కొండకు అంజనాద్రి అని నామకరణం జరిగింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

Similar News

News April 2, 2026

ఈ వార్తలూ చదవండి..

image

⬇ గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!
⬇ క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్‌బై
⬇ చిరు ఇంట హనుమాన్‌ను తాకిన సూర్యకిరణాలు(VIDEO)
⬇ ట్రెడిషనల్ పనికి టెక్నాలజీ తోడు.. ఆనంద్ ప్రశంస
⬇ జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..
⬇ సచిన్ స్పెషల్ వీడియో
⬇ ‘రామాయణ’ టీజర్.. రాముడి లుక్ రివీల్!
⬇ VIDEO: ట్రంప్‌ను ఏసుక్రీస్తుతో పోల్చిన పాస్టర్
⬇ KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!

News April 2, 2026

గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!

image

హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే రిలీజైన పెహల్వాన్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా రిలీజైన ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ ఎలా ఉందో COMMENT చేయండి.

News April 2, 2026

ఇలా నవ్వడమూ ఓ జబ్బే..!

image

కారణం లేకుండా, సంతోషం కలగకున్నా నవ్వే ఓ జబ్బు ఉందని మీకు తెలుసా? ‘లాఫింగ్ ఎపిలెప్సీ’ అనే అరుదైన వ్యాధితో రోగులు ఆపుకోలేనంతగా నవ్వుతూ ఫిట్స్ బారిన పడతారు. ఇటీవల AIIMS జోధ్‌పూర్ ఈ వ్యాధి చికిత్సలో విజయం సాధించింది. ‘మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ’ ద్వారా రోగులకు శాశ్వత పరిష్కారం అందించింది. మెదడులోని ‘హైపోథాలమస్’భాగంలో ఏర్పడే హైపోథాలమిక్ హమార్టోమా అనే చిన్న గడ్డ వల్ల నియంత్రణ లేకుండా నవ్వుతుంటారు.