News October 6, 2025
రొమ్ము క్యాన్సర్: స్వీయ పరీక్షతో అడ్డుకట్ట

ప్రతి మహిళా టీనేజీ నుంచే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని హేమాటో ఆంకాలజిస్ట్ విశాల్ టోకా వెల్లడించారు. ‘రొమ్ముల్ని తాకినప్పుడు గడ్డలు తెలిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. బ్రెస్ట్ ఆకృతిలో మార్పులు కనిపించినా, చంకల్లో గడ్డ కనిపించినా నొప్పి లేదని తేలిగ్గా తీసుకోవద్దు. బ్రెస్ట్‌పై దద్దుర్లు, నిపుల్స్ ముడుచుకున్నట్లుగా లోపలివైపునకు ఉన్నా, రక్తస్రావం ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి’ అని చెప్పారు.
Similar News
News March 21, 2026
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.12,160 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,540 పలుకుతోంది.
News March 21, 2026
మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ వద్ద నిలిచిపోయిన నౌకల్లో 2 భారత్ రానున్నాయి. LPG ఉన్న పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్‌లు ప్రస్తుతం UAEలోని షార్జా వద్ద ఉన్నాయి. ఇవి భారత జెండాతో నేటి నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. గతవారం రెండు LPG నౌకలను ఇరాన్ వదిలిపెట్టడంతో అవి మనదేశానికి చేరుకున్నాయి. వీటికి కూడా ఇరాన్ అడ్డుకట్ట వేయదని IND భావిస్తోంది. ఈ రెండు నౌకలు వస్తే దేశంలో గ్యాస్ కొరత కాస్త తీరనుంది.
News March 21, 2026
గోదావరిలో ఐదుగురు గల్లంతు.. మృతదేహాలు లభ్యం

TG: భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిని శ్రీకర్, అభిరామ్, నవదీప్, సతీశ్, తేజగా గుర్తించారు. నిన్న ముగ్గురి మృతదేహాలు దొరకగా ఈరోజు మిగిలిన ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


