News October 6, 2025
HYD: మల్లేశ్‌కు ఉద్యోగం కల్పించిన NIMS డైరెక్టర్

ఎత్తు తక్కువ కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న శంషాబాద్ వాసి మరుగుజ్జు మల్లేశ్‌కు NIMS డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప అండగా నిలిచారు. తన బాధ విన్న ఆయన, మల్లేశ్‌కు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చి వెంటనే లిఫ్ట్ ఆపరేటర్‌గా నియామకపత్రం అందజేశారు. దీంతో మల్లేశ్ ఆనందం వ్యక్తం చేస్తూ, తన జీవితానికి కొత్త ఆశ కలిగించిన బీరప్పకి కృతజ్ఞతలు తెలిపాడు.
Similar News
News October 6, 2025
HYD: హైవేలపై ఏ మాత్రం తగ్గని ట్రాఫిక్ జామ్..!

HYD నుంచి వరంగల్, విజయవాడ, నాగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల పండుగ నేపథ్యంలో సిటీ నుంచి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి నగరానికి వస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు అనేక చోట్ల ట్రాఫిక్ పోలీసులు, సిబ్బందిని, SCSC బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.
News October 6, 2025
HMDA పరిధిలో సుమారు 3,600 చెరువులు

HYD నడిబొడ్డు నుంచి సర్కిల్‌లో ORR వరకు మొత్తం HMDA పరిధిలో సుమారుగా 3,600 చెరువులు ఉన్నట్లుగా CE రవీందర్ తెలియజేశారు. అనేక ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి నత్తనడకన సాగుతోందని పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన పలు వివరాలు తెలిపారు. చెరువుల సమీపంలో ఉన్న పార్కులను అభివృద్ధి చేసి, లోకల్ బాడీకి అందజేయడం తమ విధి అని చెప్పారు.
News October 6, 2025
HYD: తూచ్.. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేయలేదు..!

తూచ్.. అసలు బదిలీ క్యాన్సల్ అన్నట్లు ఉంది వ్యవహారం. నిన్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ అనంతరం అక్కడ సైదులును నియమిస్తూ పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 గంటల తర్వాత నోటిఫికేషన్‌లో మార్పు చేస్తూ యధావిధిగా వెంకటేశ్వర రెడ్డిని కొనసాగించింది. ఎస్‌బీకి సైదులును ట్రాన్స్‌ఫర్ చేశారు.