News October 6, 2025

NLG: అభ్యర్థుల కోసం అన్వేషణ.. పార్టీల వ్యూహాలు

image

నల్గొండ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజారిటీ సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో 33 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ, 33 ఎంపీపీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను సేకరించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఎన్నికల కోసం ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు.

Similar News

News October 6, 2025

జిల్లాలో యూరియా నిల్వలున్నాయ్: కలెక్టర్

image

జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఆర్‌ఎస్‌కేలు, ప్యాక్స్‌ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 186 మెట్రిక్ టన్నుల యూరియాను 1,945 మంది రైతులకు అందజేసినట్లు ప్రకటించారు. అదనంగా 166 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉన్నందున అవసరమైన రైతులు సమీప కేంద్రాలకు వెళ్లి పొందవచ్చని సూచించారు.

News October 6, 2025

కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించిన నేపథ్యంలో, పార్కులో అత్యాధునిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పార్క్ నిర్మాణ పురోగతిపై సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News October 6, 2025

ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

image

CJI BR గవాయ్‌పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.