News October 6, 2025
మస్క్ సంస్థకు US ఆర్మీ రూ.6K Cr కాంట్రాక్టు

స్పేస్ ఎక్స్ సంస్థ భారీ US మిలిటరీ కాంట్రాక్టు పొందింది. వచ్చే ఆర్థిక సం.లో ఆర్మీ చేపట్టే 7 కీలక రాకెట్ లాంచ్‌లలో 5 మస్క్ సంస్థకు దక్కాయి. నేషనల్ సెక్యూరిటీ స్పేస్ లాంచ్ ప్రోగ్రాం(NSSL) కింద జరిగిన ఈ ఒప్పంద విలువ $714 మిలియన్లు (₹6,339 కోట్లు). ట్రంప్-మస్క్ మధ్య చెడిన మైత్రి మళ్లీ కుదిరాక ఇది జరగడం గమనార్హం. ఇక అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థకు అర్హతలు లేవని కాంట్రాక్ట్ ఇవ్వలేదు.
Similar News
News October 6, 2025
ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

CJI BR గవాయ్‌పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.
News October 6, 2025
ప్రభుత్వ పెద్దల అండతోనే కల్తీ మద్యం రాకెట్: YCP

AP: కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులున్నాయని YCP నేత జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. ‘టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపుల పాలసీని రద్దుచేశారు. ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇదంతా జరుగుతుందా? CBN దీనిపై వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. జిల్లాల్లో కల్తీ లిక్కర్ డెన్లను ఏర్పాటుచేసి ఆదాయాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని దుయ్యబట్టారు.
News October 6, 2025
ఎన్నికల కమిషన్‌పై KTR వ్యంగ్యాస్త్రాలు

TG: బిహార్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై BRS నేత KTR వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వెల్ డన్ ECI. ముందు SIRతో భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల ముందు 1.21 కోట్ల మంది మహిళా ఓటర్లకు <<17929774>>లంచం<<>> ఇచ్చేందుకు NDA ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఫ్రీ & ఫెయిర్ ఎలక్షన్స్ అని చెబుతోంది. వెరీ వెల్ డన్’ అంటూ సెటైర్ వేశారు.