News October 6, 2025
1.21 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు

‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద బిహార్ CM నితీశ్ మరో 21 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు NDA ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రారంభించింది. తొలి విడతలో 75 లక్షల మందికి, రెండో విడతలో 25 లక్షల మందికి సాయమందించింది. ఇప్పటివరకు 1.21 కోట్ల మంది లబ్ధి పొందారు. ఈ డబ్బును సద్వినియోగం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు సాయం అందించనుంది.
Similar News
News October 6, 2025
ఎకరం రూ.177 కోట్లు.. రికార్డు ధర

TG: TGIIC నిర్వహించిన భూ వేలంలో రికార్డు ధర నమోదైంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ 7.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకు గాను మొత్తం రూ.1,357.57 కోట్లు చెల్లించింది. గతంలో కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే.
News October 6, 2025
16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: CBN

AP: పౌరసేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే ప్రభుత్వానికి ముఖ్యమని CM CBN స్పష్టం చేశారు. ‘IVRS, QR కోడ్ ద్వారా వెల్లడవుతున్న ప్రజాభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది? అసంతృప్తి ఎక్కడెక్కడ ఉంది? అన్న సమాచారాన్ని క్రోడీకరించాలి. అప్పుడే సమస్య మూలాల్ని కనుగొని పరిష్కరించగలుగుతాం’ అని పేర్కొన్నారు. ఈనెల 16న శ్రీశైలం వస్తున్నPM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
News October 6, 2025
ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

CJI BR గవాయ్‌పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.