News October 6, 2025
సికింద్రాబాద్ స్టేషన్.. 63% రీ డెవలప్మెంట్ పూర్తి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 63% పూర్తయినట్లు DRM డా.గోపాలకృష్ణన్ తెలిపారు. ఇప్పటికే వెయిటింగ్ హిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలో పూర్తికానున్న మిగతా వాటిని సైతం ప్రయాణికులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. నెల రోజుల్లో 12% పనులలో వేగం పెంచినట్లుగా చెప్పుకొచ్చారు.
Similar News
News October 6, 2025
HYD: పదేళ్ల KCR పాలనలో అభివృద్ధి లేదు: మంత్రి

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100% బీసీకే టికెట్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. KCR పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి దూరమైందని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
News October 6, 2025
జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థికి టికెట్ ఖాయం: TPCC చీఫ్

జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థికి టికెట్ ఖాయమని, ముగ్గురు బీసీల మధ్య గట్టి పోటీ ఉందని, రేపు సీఎంతో చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్ట్‌ను ఏఐసీసీకి పంపిస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. HYDలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. మంత్రుల రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక చేస్తామని, రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
News October 6, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు

HYDలోని హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజావాణిలో భాగంగా అనుమతులు లేని లేఅవుట్లతో పాటు రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.