News October 6, 2025

సంగారెడ్డి: ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు నిధులు మంజూరు

image

సంగారెడ్డి జిల్లాలోని మూడు ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు నిధులు మంజూరైనట్లు డీఈవో వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. సంగారెడ్డిలోని పోలీస్ లైన్, మనూరు మండలం మాయికోడ్, అందోల్ మండలం తాడ్ మన్నూరు పాఠశాలలకు ఈ నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

image

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.

News March 16, 2026

పెద్దపులి కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు..?

image

కొడిమ్యాల మండలం గంగారాం తండాలో రెండు రోజులుగా పశువులపై పెద్ద పులి దాడి చేయడంతో గంగారాం తండా, దమ్మయ్య పేట సూరంపేట గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట బయటకు రావద్దని వారు ప్రజలకు తెలిపారు.

News March 16, 2026

ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి

image

98వ ఆస్కార్ అవార్డుల ప్రకటన సందర్భంగా గత ఏడాది కాలంలో చనిపోయిన సినీ ప్రముఖులకు అకాడమీ నివాళులర్పించింది. వీరిలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్ ఉన్నారు. రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, రాబర్ట్ డువాల్, కేథరీన్ ఓహారా, డయాన్ కీటన్ వంటి హాలీవుడ్ తారలనూ అకాడమీ గుర్తు చేసుకుంది.