News October 6, 2025
ప్రమాదాన్ని ఊహించలేకపోయి..నిండు ప్రాణాన్ని కొల్పోయాడు

ప్రయాణికులు వంతెనను వినియోగించాలని, పట్టాలను దాటవద్దని, గమనంలో ఉన్న రైలును ఎక్కొద్దని రైల్వేస్టేష్టన్‌లో ప్రచారం చేస్తుంటారు. వాటిని పెడచెవిన పెట్టి నిండు ప్రాణాలను కొల్పోతున్నారు. అలాంటి ఘటనే ఏలూరు రైల్వేస్టేషన్‌లో ఇవాళ జరిగింది. ఆదివారపుపేటకు చెందిన బంగారు(40) దోబిగా జీవనం సాగిస్తున్నాడు. పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడని రైల్వే హెచ్‌సీ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైంది.
Similar News
News March 12, 2026
గుంటూరులో విషాదం

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News March 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 12, 2026
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ శ్రీనివాస్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో మొత్తం 15,337 మంది విద్యార్థులు (7,700 మంది బాలురు, 7,637 మంది బాలికలు) పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు.


