News October 6, 2025
RECORD: 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.1,57,400గా ఉంది.
Similar News
News October 6, 2025
MIM మాకు మద్దతు ఇస్తుంది: పీసీసీ చీఫ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MIM తమకు మద్దతు ఇస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. బీసీకి టికెట్ వచ్చే అవకాశం ఉందని, రెండు మూడు రోజుల్లో అభ్యర్థి పేరు ఖరారవుతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
News October 6, 2025
ప్రాక్టీస్ షురూ చేసిన హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్ట్ అయిన హిట్‌మ్యాన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 10 మంది ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్లుగా పిచ్ ఎంపిక చేసుకుని సాధన చేశారు. కాసేపు జిమ్ చేశారు. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
News October 6, 2025
మీ కోపాన్ని చాటింగ్‌లో చూపిస్తున్నారా?

రిలేషన్షిప్‌లో గొడవలు కామన్. కానీ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చేసే వాదనలు ప్రమాదకరమని అక్రాన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. చాటింగ్ ద్వారా జరిగే గొడవలు ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్స్ కంటే 3 రెట్లు ఎక్కువ సేపు జరుగుతాయని తేలింది. అలాగే ఇవి 4 రెట్లు ఎక్కువ చిరాకు తెప్పిస్తాయట. చిన్న విభేదాలు పెద్దవిగా మారి స్నేహాలు, సంబంధాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయట. అందుకే మాట్లాడి సర్దిచెప్పుకోవడం బెటర్.