News October 6, 2025

కెప్టెన్‌గా ఎదగాలన్నదే నా లక్ష్యం: జైస్వాల్

image

టీమ్‌ఇండియాకు ఏదో ఒకరోజు తాను కెప్టెన్ కావాలనుకుంటున్నట్లు యశస్వీ జైస్వాల్ వెల్లడించారు. వన్డే వరల్డ్ కప్ గెలవాలనే కసితోపాటు కెప్టెన్ కావడమూ తన దీర్ఘకాలిక లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతూ నాయకుడిగా ఎదిగేందుకు రోజూ ప్రయత్నిస్తున్నా’ అని తెలిపారు. అయితే గిల్‌ ఫామ్‌లో ఉన్నంత కాలం జైస్వాల్‌కు కెప్టెన్ అవకాశాలు రావడం తక్కువే. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 6, 2025

ప్రాక్టీస్ షురూ చేసిన హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్ట్ అయిన హిట్‌మ్యాన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 10 మంది ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్లుగా పిచ్ ఎంపిక చేసుకుని సాధన చేశారు. కాసేపు జిమ్ చేశారు. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

News October 6, 2025

మీ కోపాన్ని చాటింగ్‌లో చూపిస్తున్నారా?

image

రిలేషన్షిప్‌లో గొడవలు కామన్. కానీ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చేసే వాదనలు ప్రమాదకరమని అక్రాన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. చాటింగ్ ద్వారా జరిగే గొడవలు ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్స్ కంటే 3 రెట్లు ఎక్కువ సేపు జరుగుతాయని తేలింది. అలాగే ఇవి 4 రెట్లు ఎక్కువ చిరాకు తెప్పిస్తాయట. చిన్న విభేదాలు పెద్దవిగా మారి స్నేహాలు, సంబంధాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయట. అందుకే మాట్లాడి సర్దిచెప్పుకోవడం బెటర్.

News October 6, 2025

ఆ సిరప్‌పై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

image

AP: కేంద్ర ఆరోగ్యశాఖలోని DGHS సూచన ప్రకారం 2ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబుకు ద్రవరూప మందులను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయకుండా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. MP, రాజస్థాన్‌‌లో పిల్లల మరణానికి దారితీసిన కల్తీ దగ్గు మందు రాష్ట్రానికి సరఫరా కాలేదన్నారు. మెడికల్ షాపులు, ప్రభుత్వాసుపత్రులకు ఆ మందు రానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.