News October 6, 2025

10 రోజుల ముందు వరకు ఓటర్ లిస్ట్‌లో మార్పులు: CEC

image

ఓటరు జాబితాలో మార్పులకు నామినేషన్లకు 10 రోజుల ముందు వరకు అవకాశముందని కేంద్ర ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఫేక్ ఓట్లపై రాజకీయ పార్టీలు కలెక్టర్లకు ఆధారాలు చూపిస్తే తొలగిస్తారని వెల్లడించారు. బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

Similar News

News October 6, 2025

MIM మాకు మద్దతు ఇస్తుంది: పీసీసీ చీఫ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MIM తమకు మద్దతు ఇస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. బీసీకి టికెట్ వచ్చే అవకాశం ఉందని, రెండు మూడు రోజుల్లో అభ్యర్థి పేరు ఖరారవుతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

News October 6, 2025

ప్రాక్టీస్ షురూ చేసిన హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్ట్ అయిన హిట్‌మ్యాన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 10 మంది ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్లుగా పిచ్ ఎంపిక చేసుకుని సాధన చేశారు. కాసేపు జిమ్ చేశారు. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

News October 6, 2025

మీ కోపాన్ని చాటింగ్‌లో చూపిస్తున్నారా?

image

రిలేషన్షిప్‌లో గొడవలు కామన్. కానీ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చేసే వాదనలు ప్రమాదకరమని అక్రాన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. చాటింగ్ ద్వారా జరిగే గొడవలు ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్స్ కంటే 3 రెట్లు ఎక్కువ సేపు జరుగుతాయని తేలింది. అలాగే ఇవి 4 రెట్లు ఎక్కువ చిరాకు తెప్పిస్తాయట. చిన్న విభేదాలు పెద్దవిగా మారి స్నేహాలు, సంబంధాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయట. అందుకే మాట్లాడి సర్దిచెప్పుకోవడం బెటర్.