News October 6, 2025

పావలా వడ్డీకే బ్యాంకుల విద్యారుణాలు: CBN

image

AP: విదేశాల్లో UG, PG చేయాలనుకునే వారికి పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలిచ్చేలా స్కీమ్ రూపొందించాలని CM CBN ఆదేశించారు. ఎంతమందికైనా అందించగలగాలన్నారు. విదేశాలతో పాటు దేశంలో ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కోర్సులకూ వర్తింపచేయాలని సూచించారు. బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు నెలకొల్పాలని ఆదేశించారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేలా అధ్యయనం చేయాలన్నారు.

Similar News

News October 6, 2025

CJIపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR <<17928232>>గవాయ్‌పై దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘దీనిపై గవాయ్ గారితో మాట్లాడాను. మన సమాజంలో అలాంటి చర్యలకు తావు లేదు. ఆ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. అలాంటి క్లిష్ట సమయంలో గవాయ్ శాంతంగా ఉండటాన్ని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.

News October 6, 2025

రేప్ కేసులో యూట్యూబర్ అరెస్ట్

image

మహిళా యూట్యూబర్‌పై రేప్ కేసులో బిహార్‌కు చెందిన నటుడు, యూట్యూబర్ మనీ మిరాజ్‌ను UP పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో అసహజ శృంగారం చేశాడని, అబార్షన్ చేయించాడని, మతం మార్చుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు FIRలో పేర్కొన్నారు. కాగా మటన్ కొట్టులో పనిచేసే మిరాజ్ కామెడీ వీడియోలు, భోజ్‌పురీ సినిమాల ద్వారా పాపులరయ్యాడు. IPL కామెంటేటర్‌గానూ పనిచేశాడు. ఇతడికి YouTube, ఇన్‌స్టా, FBలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

News October 6, 2025

కల్తీ మద్యంపై వైసీపీ ఆరోపణలు.. లోకేశ్ ఆగ్రహం

image

AP: ప్రభుత్వ పెద్దల అండతోనే కల్తీ మద్యం రాకెట్ నడుస్తోందన్న <<17931472>>వైసీపీ<<>> ఆరోపణలపై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ‘క‌ల్తీ మ‌ద్యం నిందితుల్లో టీడీపీ నేత‌లున్నా మా ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. వారిని మా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మీ ఐదేళ్ల పాల‌న‌లో ఏం చేశారో మ‌రిచిపోయి ఆరోప‌ణ‌లు చేయొద్దు. డ‌బ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్‌తో వేల మంది ప్ర‌జ‌ల ప్రాణాలు తీశారు’ అని ట్వీట్ చేశారు.