News October 6, 2025

వీరి రుణం తీర్చుకుంటేనే మానవ జన్మకు సార్థకత

image

మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి పితృ, దైవ, రుషి రుణాలు తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో కష్టపడి పెంచిన తండ్రికి ధర్మబద్ధంగా ఉంటూ తనయుడు తన రుణం తీర్చాలి. ఈ సృష్టిని పోషిస్తున్న భగవంతుని రుణం ధర్మాచరణతో తీర్చాలి. ఇక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు, రుషుల రుణాన్ని వారి జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా తీర్చుకోవాలి. ఈ మూడు రుణాలను తీర్చుకున్నప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత లభిస్తుంది.

Similar News

News October 6, 2025

మేమంతా క్షేమంగానే ఉన్నాం: విజయ్

image

కారు <<17931879>>ప్రమాదంపై<<>> సినీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా క్షేమంగానే ఉన్నామని, ఎవరూ కంగారు పడొద్దని తెలిపారు. ‘కారుకు చిన్న ప్రమాదం జరిగింది. కానీ మేమంతా బాగానే ఉన్నాం. ఆ తర్వాత స్ట్రెంత్ వర్కౌట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. కాస్త తలనొప్పిగా ఉంది అంతే. బిర్యానీ తిని నిద్రపోతే అదే ఫిక్స్ అవుతుంది. మీ అందరికీ నా ప్రేమను పంపిస్తున్నా. ఈ వార్తతో ఎవరూ స్ట్రెస్ అవ్వొద్దు’ అని ట్వీట్ చేశారు.

News October 6, 2025

ఇది ధర్మాన్ని అతిక్రమించడమే: పవన్

image

AP: CJI గవాయ్‌పై లాయర్ దాడికి యత్నించడాన్ని Dy.CM పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ‘ప్రజల మనోభావాలను అర్థం చేసుకోగలను. కానీ ఇది ధర్మాన్ని అతిక్రమించడమే. చట్టానికి కట్టుబడి ఉండడమే సనాతన ధర్మం. పాషన్‌తో కాదు ప్రాసెస్‌తోనే న్యాయం జరుగుతుందని మన పురాతన గ్రంథాల్లో ఉంది. లక్షలాది మంది సనాతనీలకు అవమానం కలిగించే ప్రతి చర్యకు మేం వ్యతిరేకం. CJI గౌరవానికి జనసేన మద్దతుగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News October 6, 2025

CJIపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR <<17928232>>గవాయ్‌పై దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘దీనిపై గవాయ్ గారితో మాట్లాడాను. మన సమాజంలో అలాంటి చర్యలకు తావు లేదు. ఆ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. అలాంటి క్లిష్ట సమయంలో గవాయ్ శాంతంగా ఉండటాన్ని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.