News October 6, 2025
NLG: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ ఇదే..

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీకాం మూడు, ఐదో సెమిస్టర్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులను అక్టోబర్ 14 లోపు ఫైన్ లేకుండా చెల్లించాలని ఎంజీయూ సీఈవో ఉపేందర్ రెడ్డి తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో అక్టోబర్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 20, 2026
ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయింపు: మంత్రి దామోదర

ప్రభుత్వం ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాణ చరిత్రలో ఆరోగ్య శాఖకు ఇదే అత్యధిక కేటాయింపులు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
News March 20, 2026
‘ధురంధర్-2’తో ఆ డైరెక్టర్లు బెదిరిపోతారు: RGV

‘ధురంధర్-2’పై మరోసారి ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ సినిమాలు తీసే దర్శకులపై ఫైర్ అయ్యారు. హీరోలను దేవుడిలా కొలుస్తూ ఫిజిక్స్, గ్రావిటీతో సంబంధం లేని చిత్రాలు తీసే డైరెక్టర్లకు ఇది వణుకుపుట్టిస్తుందన్నారు. దీంతో అసలైన హీరోయిజం పుట్టిందని.. ఇప్పుడు రొటీన్ స్టార్ హీరోలంతా జోకర్లుగా కనిపిస్తున్నారని విమర్శించారు. రొటీన్ యాక్షన్ మూవీలను ఇకపై ఆడియన్స్ చూడరని ట్వీట్ చేశారు.
News March 20, 2026
కేయూ: బీ.ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ టైమ్ టేబుల్ విడుదల

బీ.ఫార్మసీ (CBCS) ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభమై 30 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. వరంగల్, హనుమకొండ సహా పలు కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని వివరాలను అధికారిక వైబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.


