News October 6, 2025
NGKL: అండర్-19.. 8న కబడ్డీ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 8న బాల, బాలికల U/19 కబడ్డీ ఎంపికలు ఉంటాయని నాగర్ కర్నూల్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. MBNRలోని స్టేడియంలో ఉ. 9:00 గం. ఎంపికలు ఉంటాయని, 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులని, బాలురు 70 కేజీలు, బాలికలు,65 కేజీల బరువు కలిగి ఉండాలని, ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్, ఆధార్ తీసుకొని రావాలన్నారు.
Similar News
News October 7, 2025
సంగారెడ్డిలో ఎస్పీ ప్రజావాణికి 16 ఫిర్యాదులు

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. మొత్తం 16 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్ఐలను ఆదేశించారు. ఇలాంటి సమస్యలున్నా నేరుగా తనకు విన్నవించవచ్చని తెలిపారు.
News October 7, 2025
VZM: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు

స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డులలో రాష్ట్రస్థాయి అవార్డును ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ లక్ష్మణరావు అందుకున్నారు. విజయవాడ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లక్ష్మణరావు అవార్డు తీసుకున్నారు. అలాగే బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి కూడా అవార్డు అందుకున్నారు. ఇద్దరికీ జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
News October 7, 2025
భీమారం: ఇంట్లోకి చొరబడి మహిళపై కుక్క దాడి

భీమారం మండలంలోని మన్నెగూడెంలో కుక్క దాడిలో వాసం గంగు అనే మహిళ సోమవారం తీవ్రంగా గాయపడింది. ఇంట్లో పడుకుని ఉన్న ఆమెపైకి కుక్క చొరబడి విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. గంగును వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.