News October 6, 2025
దౌల్తాబాద్: సీపీ అనురాధ పెద్ద మనసు

దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకు చెందిన జోడు రాకేశ్‌కు కుడిచేయి లేని విషయం తెలుసుకున్న సీపీ డాక్టర్ బి. అనురాధ పెద్ద మనసు చాటుకున్నారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి రాకేశ్‌కు కృత్రిమ చేయి(ఆర్టిఫీషియల్ హ్యాండ్) అమర్చేందుకు అయ్యే ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సీపీని రాకేశ్ కలిసి పుష్పగుచ్ఛం అందించగా, రాకేశ్ తండ్రి మనోహార్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 6, 2025
ఎడపల్లి: బంగారం కోసం మహిళ హత్య.. ఇద్దరి అరెస్టు

దూరపు బంధువైన మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న కేసులో ఎడపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్‌ను ఛేదించి నిందితుడైన జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి బాలకృష్ణ (36)ను, కొండపాక లక్ష్మయ్య (55)లను అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.
News October 6, 2025
సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలి: మేయర్

నగరంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ (సీబీజీ)ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం క్లైమేట్ ప్రాజెక్ట్స్ ప్రిపరేషన్ ఫెసిలిటీ(సీపీపీఎఫ్)లో భాగంగా శక్తి, పీడబ్ల్యుసీ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ పాల్గొన్నారు.
News October 6, 2025
బ్యాలెట్ పేపర్ల ముద్రణకు 8లోపు టెండర్లు దాఖలు చేయాలి: కలెక్టర్

స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సంబంధించి అక్టోబర్ 8లోపు టెండర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన నాలుగు రోజుల్లోపు బ్యాలెట్ పేపర్లను ముద్రణ చేయాలని ఆదేశించారు. ముద్రణకు అవసరమైన సింబల్ బ్లాక్స్, పింక్, వైట్ పేపర్ వంటి సామాగ్రిని సరఫరా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.