News October 6, 2025

కడప: వీళ్లకు నామినేటెడ్ పదవులు లేనట్లేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా కడప జిల్లాలోని పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు లభించలేదు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టికెట్లు ఆశించి భంగపడ్డ భూపేశ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్‌లకు ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు వస్తాయని వారి వర్గీయులు ఆశించారు. అయినా వీరికి ఏ ఒక్క పదవి దక్కలేదు. ఇక బద్వేల్, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు రితేశ్ రెడ్డి, బీటెక్ రవిలు కూడా పదవులు ఆశించిన వారిలో ఉన్నారు.

Similar News

News April 3, 2026

కడప జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు

image

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి రూ.46,590లు పెనాల్టీ వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అన్ని రకాల వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలను, డ్రైవింగ్ లైసన్స్‌లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News April 3, 2026

కడప: రూ.లక్షలు కొట్టేసిన సైబర్ నిందితుడు అరెస్ట్

image

సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 9 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశామని విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. తాజాగా ఈ ముఠాకు సంబంధించి కడప జిల్లాకు చెందిన నగేషయ్యను అరెస్టు చేశామన్నారు. విశాఖలోని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.83 లక్షల వరకు దోచుకున్నారన్నారు. నిందితుడికి మణికంఠ, చందు అనే వారు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్నట్లు గుర్తించామన్నారు.

News April 3, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,170
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,956
*వెండి 10 గ్రాముల ధర రూ.2,400
———