News October 6, 2025

ఆ మందు నెల్లూరు జిల్లాలో లేదు: రమేశ్

image

మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై నెల్లూరు ఔషద నియంత్రణ శాఖ ఏడీ రమేశ్ రెడ్డిని Way2News ఫోన్లో సంప్రదించగా.. కోల్డ్రిఫ్ దగ్గు మందు నెల్లూరు జిల్లాలో లేదన్నారు. ఆ మందులో డై ఇథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

నెల్లూరు: కూటి కోసం ఎన్ని కష్టాలో..!

image

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. నెల్లూరులో బుడ్డ గాంధీ తాతను చూస్తే నిజమే అనిపిస్తుంది. లీలా మహల్ సెంటర్ వద్ద ఓ బాలుడు ఇలా భిక్షాటన చేశాడు. అప్పటి గాంధీ బ్రిటిష్ వారిమీద పోరాటం చేస్తే.. నేటి గాంధీలు కడుపు నింపుకునేందుకు రోజుకో పోరాటం చేస్తున్నారు. ఈ బుడ్డ గాంధీకి కొందరు డబ్బులు ఇవ్వగా.. మరికొందరు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

News March 19, 2026

ట్రెడిషనల్ లుక్‌లో నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు కలెక్టరేట్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఉగాది వేడుకలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో కవులు, కళాకారులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణం చదువుతున్నారు. కలెక్టర్ ట్రెడిషనల్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

News March 19, 2026

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ MLA

image

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కానున్నారు. TDP నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు 98 రోజుల నుంచి జైలులో ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ ఇవ్వడంతోఆయన ఇవాళ విడుదల కానున్నారు. ఇప్పటికే బెయిల్ పేపర్స్‌ను జైలు అధికారులకు అందజేశారు.