News October 6, 2025
గడువు కాకముందే సమస్య పరిష్కరించాలి: కలెక్టర్

నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన 2017, రీ- ఓపెన్ దరఖాస్తులు 539 ఉన్నాయని గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. సోమవారం కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న అంశాలను పరిశీలించి సరైన రీతిలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
Similar News
News March 14, 2026
BREAKING: కమర్షియల్ సిలిండర్ల డెలివరీ ప్రారంభం

దేశంలోని పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల డెలివరీ పునరుద్ధరించినట్లు కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే LPG ఉత్పత్తిని పెంచామని, నేటి నుంచి కమర్షియల్ సిలిండర్ల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. కాగా ఏయే రాష్ట్రాల్లో పంపిణీ ఉంటుందో వెల్లడించలేదు.
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వంటగ్యాస్ సరఫరాపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధతులతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.
News March 14, 2026
తూ.గో: గ్యాస్ వినియోగదారులకు కలెక్టర్ సూచనలు

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గృహ అవసరాల వినియోగం, అత్యవసర సేవల కోసం ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ పంపిణీదారులతో జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


