News October 6, 2025

32 ఫిర్యాదులు స్వీకరించిన ఆదిలాబాద్ SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, సుదూర ప్రాంతాల వారు జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ఎస్పీ అఖిల్ మహాజన్‌ను సంప్రదించారు. సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఎస్పీని నేరుగా సంప్రదించాలంటే 8712659973 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు.

Similar News

News October 6, 2025

ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధమై ఉండాలి: ADB SP

image

రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణ నిర్వహించడానికి ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వహించాలన్నారు. నిజాయితీతో విధులు నిర్వర్తించి ఎన్నికలను సమష్టి కృషితో పూర్తి చేయాలని సూచించారు.

News October 6, 2025

ADBని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలి: జోగురామన్న

image

కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి పంట నష్టంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి కలెక్టర్ రాజర్షిషాకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదుతో పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయన్నారు.

News October 6, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంకండి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు-2025 సజావుగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. రీట‌ర్నింగ్ అధికారులు (ROs) స్టేజ్-II, సహాయ రీట‌ర్నింగ్ అధికారులు (AROs) స్టేజ్-I లకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ జరిగింది. ACLB రాజేశ్వర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.