News October 6, 2025
HYD: పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

HYD రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పీజీ (రెగ్యులర్, ప్రత్యేక కోటా), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు దాఖలు చేసుకునే గడువుని పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch.విద్యాసాగర్ ఈరోజు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈనెల 12వ తేదీ సా.5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
Similar News
News October 7, 2025
జూబ్లీహిల్స్‌లో బస్తీ యాత్ర చేపడతాం: టీపీసీసీ చీఫ్

HYD జూబ్లీహిల్స్‌లో బస్తీ యాత్ర చేపడతామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం HYDలో ఆయన మాట్లాడారు. ఈ యాత్రలో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు ముగ్గురు మంత్రులు పాల్గొంటారని వెల్లడించారు. అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ రేసులో లేరని, ఆయన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవుతారని తెలిపారు. ఎంఐఎం మద్దతు ఇంకా స్పష్టంగా లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. మీ కామెంట్?
News October 7, 2025
HYD: ఇక.. ఆర్టీసీ డ్రైవర్లకు సీటు బెల్ట్ తప్పనిసరి..!

HYD నగరం సహా రాష్ట్రంలోని అనేక డిపోల పరిధిలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్లకు సీటు బెల్టులు పెట్టుకోవడం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో బస్సుల్లో డ్రైవర్ సీట్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ సీట్లకు సీటు బెల్టులు అమరుస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా ప్రాంతాలకు సైతం ఈ నిబంధన విస్తరిస్తామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
News October 7, 2025
HYD: హైడ్రాను అభినందించిన హైకోర్టు

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సోమవారం ప్రశంసలు కురిపించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా యజ్ఞంలా పని చేస్తోందని అభినందించారు. బతుకమ్మకుంటను చూస్తే ముచ్చటేస్తోందని చెప్పారు. టీడీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించాలని జస్టిస్ సూచించారు.