News October 6, 2025
రోహిత్, విరాట్ ప్రపంచకప్ ఆడాలంటే..

2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కెప్టెన్సీ మార్చిన బీసీసీఐ.. మరో రూల్ పెట్టింది. ఏ ఆటగాడైనా ఖాళీ సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ప్లేయర్స్ తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగించడమే దీని ఉద్దేశం. టెస్టులు, టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, విరాట్ కూడా ఈ రూల్ పాటించాల్సి ఉంటుంది. అలా అయితేనే వారు 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ ఉంది.
Similar News
News October 7, 2025
పిల్లలకు దగ్గు మందు (కాఫ్ సిరప్).. జాగ్రత్తలు

*వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు దగ్గు మందు ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
*డాక్టర్ సూచన లేకుండా మందులు ఇవ్వొద్దు. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
*పెద్దలకు ఇచ్చే మందులను పిల్లలకు ఇవ్వకూడదు. తక్కువ మోతాదులో ఇచ్చినా ప్రమాదమే.
*తయారీ, ఎక్స్‌పైరీ తేదీని చూడాలి.
*రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు చాలా సార్లు దానంతట అదే తగ్గుతుంది. వారికి సిరప్ వాడకూడదు.
News October 6, 2025
కొమురం భీం వర్ధంతి.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TG: గోండుల ఆరాధ్య దైవం, పోరాట యోధుడు కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా రేపు (మంగళవారం) ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు వర్తిస్తుందని కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సెలవు నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో NOV 8, ఆదిలాబాద్ జిల్లాలో DEC 12న (రెండో శనివారాలు) స్కూళ్లు పని చేస్తాయని పేర్కొన్నారు.
News October 6, 2025
మేమంతా క్షేమంగానే ఉన్నాం: విజయ్

కారు <<17931879>>ప్రమాదంపై<<>> సినీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా క్షేమంగానే ఉన్నామని, ఎవరూ కంగారు పడొద్దని తెలిపారు. ‘కారుకు చిన్న ప్రమాదం జరిగింది. కానీ మేమంతా బాగానే ఉన్నాం. ఆ తర్వాత స్ట్రెంత్ వర్కౌట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. కాస్త తలనొప్పిగా ఉంది అంతే. బిర్యానీ తిని నిద్రపోతే అదే ఫిక్స్ అవుతుంది. మీ అందరికీ నా ప్రేమను పంపిస్తున్నా. ఈ వార్తతో ఎవరూ స్ట్రెస్ అవ్వొద్దు’ అని ట్వీట్ చేశారు.