News October 6, 2025
రంగారెడ్డి: అభ్యర్థుల ఎంపికపై BRS ఫోకస్..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో పర్యటిస్తూనే మరోవైపు పార్టీలో చేరికలపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు.
Similar News
News March 15, 2026
102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్‌తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.
News March 15, 2026
KTDM: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కూతురు చెప్పడంతో వీడిన మిస్టరీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లిలో ఎస్‌డీ జాఫర్ హత్య కలకలం రేపింది. భార్య ఖతీజా ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మద్యం తాగడంతో చనిపోయాడని, సహజ మరణంగా చిత్రీకరించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కుమార్తె చెప్పిన వివరాలతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 15, 2026
మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్‌గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.


