News October 6, 2025

నిర్మల్: రేపటి నుంచి సదరం శిబిరం

image

దివ్యాంగులు సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ నెలలో నిర్వహించే సదరం శిబిరం తేదీలను ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 30 వరకు శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కంటి చూపు, ఆర్థోపెడిక్, వినికిడి లోపం ఉన్నవారు స్లాట్ బుక్ చేసుకొని మొబైల్‌కు సమాచారం వచ్చిన వారందరూ నిర్దేశించిన కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని వివరించారు.

Similar News

News March 17, 2026

నల్గొండ: రూ.25 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

image

పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.25 లక్షల విలువైన 60 కిలోల గంజాయి పట్టుబడింది. ఆటోలో తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, నల్గొండకు చెందిన ఒకరిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు భరంపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రామన్నపేట, మోత్కూర్ ఎక్సైజ్ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాయి.

News March 17, 2026

నవోదయలో కోదాడ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

image

కోదాడ పట్టణానికి చెందిన మేకల సాయి శ్రీయాంక్ నవోదయ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించాడు. 97.5 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. శ్రీయాంక్ తండ్రి చంద్ర శేఖర్ అనంతగిరి మండలం వాయిల సింగారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి గోల్తాండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీయాంక్‌ను పలువురు అభినందించారు.

News March 17, 2026

గుండాల తహశీల్దార్ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

గుండాలలో నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా నిర్దిష్ట గడువులో కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.