News October 6, 2025
దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే

ఎ లేడీ ఆఫ్ మెనీ ఫస్ట్స్..దీనికి నిర్వచనం ముత్తులక్ష్మిరెడ్డి. బ్రిటిష్ ఇండియాలోని తొలి మహిళా ఎమ్మెల్యే. దేశంలోనే తొలి హౌస్‌సర్జన్. స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తొలి ఛైర్‌పర్సన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి డిప్యూటీ ప్రెసిడెంట్. 1886 జులై 30న ముత్తులక్ష్మి మద్రాసులోని పుదుక్కోటైలో జన్మించారు. 13 ఏళ్ల వయసులో 10th, 1912లో వైద్యవిద్యను పూర్తి చేశారు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు.
Similar News
News March 22, 2026
‘నలభీమ పాకం’ అర్థం ఏమిటి?

మగవాళ్లు అత్యంత రుచికరమైన వంటకం చేసినప్పుడు ‘నలభీమ పాకం’ జాతీయాన్ని ఉపయోగిస్తారు. భారతంలో దమయంతి భర్త నలుడు. జూద వ్యసనంతో నిషాధ రాజ్యాన్ని కోల్పోయి బుషపర్ణుడి వద్ద వంటవాడిగా చేరి అద్భుతమైన వంటలు చేసేవారు. పాండవుల అజ్ఞాతవాసంలో విరాటరాజు దగ్గర భీముడు వంట పనిచేసేవారు. వీరిద్దరి పనిని కవులు నలభీమ పాకంగా అభివర్ణించారు. మీలో ఎవరైనా రుచికరమైన వంటలు చేసేవారున్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 22, 2026
చచ్చిపోవచ్చుగా అన్నారు: వరుణ్

తన IPL కెరీర్‌లో 2021 సీజన్ దారుణంగా గడిచిందని KKR స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గుర్తుచేసుకున్నారు. ‘అప్పట్లో కొవిడ్ సోకిన తొలి ఆటగాడిని నేనే. ఆ తర్వాత సందీప్ వారియర్‌కూ వచ్చింది. దీంతో టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఆగిపోవడంతో అభిమానులు కోపంతో నన్ను తిట్టారు. చచ్చిపోవచ్చుగా అన్నారు’ అని ఓ షోలో చెప్పారు. కాగా ఆ ఏడాది IPL రెండో దశను UAEలో నిర్వహించిన విషయం తెలిసిందే.
News March 22, 2026
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.


