News October 6, 2025

వనపర్తి: ‘గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం’

image

గ్రంధాలయాలు దేవాలయాలతో సమానమని వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పుస్తక పాఠకులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కనీస అవసరాలను తీర్చకపోయినా, గృహంలో స్థానం కల్పించకపోయినా తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం-2007 ప్రకారం శిక్షార్హులన్నారు.

Similar News

News October 7, 2025

తెనాలి: ఆ కేసులోనూ అతడు ముద్దాయి..!

image

అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో A-12 ముద్దాయిగా ఉన్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఎక్సైజ్ అధికారులు గాలిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి, తెనాలి ఐతానగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌పై జరిగిన దాడి కేసులోనూ శ్రీనివాసరావు A-11 ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం.

News October 7, 2025

విజయవాడలో జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల తైక్వాండో జట్ల ఎంపికలు సోమవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఐఎంసీ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని దుర్గారావు తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు.

News October 7, 2025

పాడేరు: ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి

image

స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతను ప్రోత్సహించడానికి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. సోమవారం పాడేరులో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరికి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యం ప్రోత్సహించాలన్నారు.