News October 6, 2025
ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా చేయాలి: కలెక్టర్

ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు కావాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, ఎంపీడీఓ మొదలగు శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించి వారు మాట్లాడారు. స్థానిక సంస్థల నేపథ్యంలో జిల్లాలో మాడల్ కోడ్ పక్కాగా అమలు అయ్యేలా అధికారులు విధులను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 7, 2025
విజయవాడలో జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల తైక్వాండో జట్ల ఎంపికలు సోమవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఐఎంసీ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని దుర్గారావు తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు.
News October 7, 2025
పాడేరు: ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి

స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతను ప్రోత్సహించడానికి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. సోమవారం పాడేరులో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరికి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యం ప్రోత్సహించాలన్నారు.
News October 7, 2025
పిల్లలకు దగ్గు మందు (కాఫ్ సిరప్).. జాగ్రత్తలు

*వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు దగ్గు మందు ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
*డాక్టర్ సూచన లేకుండా మందులు ఇవ్వొద్దు. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
*పెద్దలకు ఇచ్చే మందులను పిల్లలకు ఇవ్వకూడదు. తక్కువ మోతాదులో ఇచ్చినా ప్రమాదమే.
*తయారీ, ఎక్స్‌పైరీ తేదీని చూడాలి.
*రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు చాలా సార్లు దానంతట అదే తగ్గుతుంది. వారికి సిరప్ వాడకూడదు.