News October 6, 2025
పోలీస్ PGRSకు 88 అర్జీలు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అనంతపురం ఎస్పీ జగదీష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో PGRS నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 88 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కరానికి వాటిని సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిపారు.
Similar News
News October 7, 2025
యాడికి: పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్

పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ విధించిన ఘటన యాడికిలో చోటు చేసుకుంది. సీఐ వీరన్న వివరాల మేరకు.. మండలానికి చెందిన ఓ బాలికపై బత్తుల కృష్ణారెడ్డి గత శనివారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు వేములపాడు సమీపంలో ఉండగా సోమవారం అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.
News October 6, 2025
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: జేసీ

అనంతపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 375 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజా క్షేమం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
News October 6, 2025
సూపర్ GSTపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

సూపర్ GST.. సూపర్ సేవింగ్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సూపర్ GST సూపర్ సేవింగ్‌పై JC శివ నారాయణ శర్మ, DRO మలోల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈనెల 19 వరకు సూపర్ GSTపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.