News April 7, 2024

నేటి నుంచి ప్రచారం పున:ప్రారంభం

image

AP: జ్వరం నుంచి కోలుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా నేడు సాయంత్రం అనకాపల్లిలో రోడ్ షో, సభలో పాల్గొంటారు. రేపు ఎలమంచిలిలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.

Similar News

News January 25, 2026

కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

image

చైనాతో ట్రేడ్ డీల్‌పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.

News January 25, 2026

సూర్యుడు దేవుడా..?

image

కాలం అత్యంత శక్తిమంతమైనది. అది సృష్టిని నిర్మిస్తుంది. తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ కాలం కంటికి కనబడదు. అలాంటి కాలాన్ని కొలిచే ప్రమాణమే సూర్యుడు. ఆయన వేసే ప్రతి అడుగు కాలానికి కొలమానం వంటిది. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, రోజులు, నెలలు అన్నీ సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే కంటికి కనిపించని దైవానికి, కంటికి కనిపించే రూపమే సూర్యుడని నమ్ముతాం. ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం.

News January 25, 2026

కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

image

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.