News October 6, 2025
పోలీస్ పీజీఆర్ఎస్‌కు 25 పిర్యాదులు: ఎస్పీ

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజావాణి) కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీలు ఎన్‌బిఎం మురళీకృష్ణ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
జిల్లాలో గ్యాస్ కొరత లేదు: తూ.గో కలెక్టర్

తూ.గో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. నిత్యం గృహ వినియోగదారులు, హాస్టళ్లు, ఆసుపత్రులకు 11 వేల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 14,829 సిలిండర్లు స్టాక్‌గా అందుబాటులో ఉన్నాయన్నారు. IOC, HPC, BPC ద్వారా సరఫరా సజావుగా సాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
News March 12, 2026
దేవరపల్లి: లారీ ఢీకొని రిటైర్డ్ వ్యవసాయాధికారి మృతి

దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాంధీనగరం గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయ శాఖ AD ఆచంట జగన్నాథరావు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గాంధీనగరంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News March 12, 2026
రాజమండ్రిలో అక్రమాల డొంక లాగుతున్న ACB

రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో రెండు రోజులుగా ACB అధికారులు చేపట్టిన తనిఖీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. కార్యాలయంలోని సుమారు 700 పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన అధికారులు, పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. గురువారం నగరవ్యాప్తంగా ACB బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించనుంది.


