News October 6, 2025

2019 తర్వాతా CBN సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేది: నిమ్మల

image

2027 చివరి నాటికి PM చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2019 తర్వాత సీఎంగా CBN కొనసాగుంటే ఇప్పటికే అది పూర్తయ్యేదన్నారు. YCP హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, రివర్స్ టెండర్లంటూ పనులు జాప్యం చేశారని విమర్శించారు. తాము పనులు వేగవంతం చేశామన్నారు. బిహార్ ఎన్నికలయ్యాక కేంద్ర మంత్రి CRపాటిల్‌ ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయనతో భేటీ అనంతరం చెప్పారు.

Similar News

News March 21, 2026

10 రోజుల్లో రూ.13,320 తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.12,160 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,540 పలుకుతోంది.

News March 21, 2026

మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

image

పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్‌ వద్ద నిలిచిపోయిన నౌకల్లో 2 భారత్ రానున్నాయి. LPG ఉన్న పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్‌లు ప్రస్తుతం UAEలోని షార్జా వద్ద ఉన్నాయి. ఇవి భారత జెండాతో నేటి నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. గతవారం రెండు LPG నౌకలను ఇరాన్ వదిలిపెట్టడంతో అవి మనదేశానికి చేరుకున్నాయి. వీటికి కూడా ఇరాన్ అడ్డుకట్ట వేయదని IND భావిస్తోంది. ఈ రెండు నౌకలు వస్తే దేశంలో గ్యాస్ కొరత కాస్త తీరనుంది.

News March 21, 2026

గోదావరిలో ఐదుగురు గల్లంతు.. మృతదేహాలు లభ్యం

image

TG: భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిని శ్రీకర్, అభిరామ్, నవదీప్, సతీశ్, తేజగా గుర్తించారు. నిన్న ముగ్గురి మృతదేహాలు దొరకగా ఈరోజు మిగిలిన ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.