News October 6, 2025
విజయవాడ బస్టాండ్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

విజయవాడ బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి గుంటూరు నుంచి మచిలీపట్నానికి వెళ్తున్న క్రమంలో 47వ ఫ్లాట్‌ఫామ్ వద్ద గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. లక్షలాది మంది ప్రయాణికులు వచ్చే బస్టాండ్‌లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా అస్వస్థతకు గురవుతున్న వారిని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు.
Similar News
News October 7, 2025
TODAY HEADLINES

* NOV 6, 11 తేదీల్లో బిహార్ ఎలక్షన్స్.. 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
* CJI గవాయ్‌పై దాడికి యత్నం.. ఖండించిన మోదీ, రేవంత్, పవన్
* నకిలీ మద్యంపై ఉక్కుపాదం: సీఎం చంద్రబాబు
* TG బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
* ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా: జగన్
* విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. క్షేమంగా ఉన్నామన్న హీరో
* HYD రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రూ.177 కోట్లు పలికిన ఎకరా
News October 7, 2025
వాహనాలకు ఫైన్లు సరే.. చెత్త సంగతేంటి సార్?: నెటిజన్లు

‘నో-పార్కింగ్ జోన్‌లో వాహనాలు కనిపిస్తే ఫైన్ వేయడం, లిఫ్ట్ చేయడం పోలీసులకు సులభం. కానీ రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాహనాలను లిఫ్ట్ చేస్తే చలాన్ రూపంలో ప్రభుత్వానికి డబ్బు వస్తుందని.. చెత్తతో ఏం రాదంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News October 7, 2025
HYD: ఇక.. ఆర్టీసీ డ్రైవర్లకు సీటు బెల్ట్ తప్పనిసరి..!

HYD నగరం సహా రాష్ట్రంలోని అనేక డిపోల పరిధిలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్లకు సీటు బెల్టులు పెట్టుకోవడం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో బస్సుల్లో డ్రైవర్ సీట్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ సీట్లకు సీటు బెల్టులు అమరుస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా ప్రాంతాలకు సైతం ఈ నిబంధన విస్తరిస్తామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.